కార్తీక మాసంలో 'కాలభైరవాష్టకం' వింటే సర్వ కష్ట ఉపశమనం

Updated: November 14, 2019 12:00:00 AM (IST)

Estimated Reading Time: 0 minutes, 12 seconds

కార్తీక మాసంలో 'కాలభైరవాష్టకం' వింటే సర్వ కష్ట ఉపశమనం

భైరవుని శివుని ప్రతిరూపం అంటూంటారు. ప్రాచీన శివాలయాల్లో ఇప్పటికీ చాలా చోట్ల భైరవ విగ్రహానికి ప్రత్యేకత వుంటుంది. శునకవాహనముతో కూడిన ఈ భైరవుడు.. వారణాసి శివాలయానికి క్షేత్రపాలకుడిగా కీర్తించబడ్డాడు. మంత్ర తంత్ర సాధనల్లో ఏం సాధించాలనుకున్నా ముందు భైరవుని అనుమతి తీసుకుంటారు. సాక్షాత్తు శివుడే కాలభైరవుడై సంచరించాడని శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి భైరవుడుని కార్తీక మాసంలో స్మరిస్తే రెట్టింపు ఫలితం వస్తుందని చెప్తారు మన దైవజ్ఞులు. భైరవుడు శివుడి అత్యంత ఉగ్రరూప అవతారంగా మన పురాణాలు చెబుతాయి. వాటిని ఉఠంకిస్తూ..ఆయన్ని స్తుతిస్తూ సాగే ఈ కాలబైరవాష్టకాన్ని విన్నా, ఈ క్రమంలో ఆయన్ని స్మరించుకున్నా పుణ్యమే. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్ర మిందు శేఖరం కృపాకరం నారదాది యోగిబృంద వందితం దిగంబరం కాశిపురాధినాథ కాలభైరవం భజే|| కాల భైరవావతారం మార్గశిరమాసపు కృష్ణపక్ష అష్టమినాడు సంభవించింది. కనుక ఆ రాత్రి కాలభైరవుని సన్నిధిలో ఉపవాస జాగరాలు చేసి ఆయనను సేవించిన వారు సకల పాపాల నుండీ విముక్త్ఱువుతారు. కార్తిక మాసంలోనూ ఆయనకు ప్రత్యేకమైన పూజలు చేస్తూంటారు. కాలభైరవ చరిత్రాన్ని చదివినా, ఆయన అష్టకాన్ని విన్నా వారికి పంచ మహాపాతకాలూ నశించి వ్యాధులూ బాధలూ నివారణ అవుతాయి. ప్రమాదాలు దరి చేరవు. గ్రహపీడలు

కామెంట్స్