తేలిక భాష లో భగవద్గీత

శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధసమయంలో పార్థుడికి కలిగిన రకరకాల సందేహాలను తీర్చేందుకు బోధించిన గీత సాక్షాత్తూ భగవంతుని ముఖతః వెలువడింది కాబట్టి భగవద్గీత అయింది.   భగవద్గీత అనేది స్వయంగా భగవంతుడు పలికిన జ్ఞానం. సకల మానవాళి శ్రేయస్సు కొరకే శ్రీకృష్ణుడు దానిని పలికాడు.  మనలోని కోరికలను, బాధలను నశింప చేయడానికి, సాటి మనిషి దుఃఖాన్ని తొలగింపజేయడానికి గీతలోని ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క ఆయుధంగానూ, ఔషధ గుళికగానూ వాడుకోవచ్చు ని విజ్ఞులు చెప్తూంటారు.  

సాధారణంగా  ఎంత పెద్ద హిట్టైన  సినిమా పాట అయినా-మూడు నెలలకు పాతదైపోతుంది. అద్బుతం అనుకున్న  కథ కూడా ఆర్నెల్లకు అంతరంగంలోంచి అదృశ్యమైపోతుంది. ఒక నవల- ఓ సంవత్సరం తర్వాత తన స్దాయి కోల్పోతుంది. కానీ వేల ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా నిత్య చైతన్య ప్రవాహమై, దారిమరిచిన బాటసారికి కరదీపికై, సమస్త భూమండలాన్ని దివ్యశక్తితో ముందుకు నడిపిస్తున్న ఏకైక గ్రంథం - ఇగిరిపోని గంధం- భగవద్గీత.  ఇదేమీ మతోద్బోధ కాదు...

సంస్కృతంలో ఉన్న ఈ గీత అర్దమై,అనుసరిస్తే దాని ఫలితం అనంతం అని భావించి ప్రముఖ నవలా రచయిత శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు మన కోసం తెలుగీకరించారు.  వీటిని అంతే అంతంగా ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు శ్రీనివాస శర్మగారు అలపించారు. మీరూ ఈ అద్బుత గీతా మకరందాన్ని గ్రోలండి...   కష్టాల కడలినుంచి సుఖాల తీరానికి చేరండి. శుభమస్తు..శ్రీకృష్ణార్పణమస్తు...