వింటే చాలు..మనమేంటో తెలిసిపోతుంది

వింటే చాలు..మనమేంటో తెలిసిపోతుంది

మనస్సు,బుద్ధి, అహంకారము అనేవి ఏమీ నేను కాను. అలాగే చెవి,నాలుక,ముక్కు, నేత్రములు మొదలైన ఇంద్రియాలను   అసలు నేను కాను.ఆకాశము,భూమి,అగ్ని,వాయువు,నీరు లాంటి పంచభూతాలను నేను కానే కాను . ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను అంటూ అంత గొప్పగా మన గురించి మనకు, మనలోపల మర్మాన్ని ..వివరించి చెప్పగలవారెవరు..అంతటి సమర్డుడు ఎవరు...కేవలం జగద్గురువు ఆది శంకరాచార్యులు వారే.

 

 ఓ సారి జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు  హిమాలయ ప్రాంతంలో సమర్దుడైన గురువు కోసం అన్వేషిస్తుండగా ఒక సన్యాసి ఎదురొచ్చి, "నువ్వు ఎవరివి?" అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా శ్రీ ఆది శంకరులవారు మొత్తం అద్వైత వేదాంతాన్ని ఆరు శ్లోకాల రూపంలో "నిర్వాణ షట్కము" గా పలికారట.  నిర్వాణం అంటే సంపూర్ణ సమదృష్టి.

ఈ  నిర్వాణ షట్కము శ్లోకాలను అత్యంత శ్రవాణానందంగా మనకు లిప్సి క ఉదయ్, రమ్య బెహ్రా గానం చేసి అందించారు. పవన్ అన్నాప్రగడ ..కంపోజ్ చేసారు. వయోలిన్ ని పేరి త్యాగరాజ్ అందిస్తే..కెమెరా,డైరక్షన్ ..కెపీ నవీన్ చేసారు


Tags: lipsika, ramya behra