శివుడే స్వయంగా వచ్చి ఈ మురళి గానం వింటాడు

శివుడే  స్వయంగా వచ్చి ఈ మురళి గానం వింటాడు

‘శివ శివా!’ అన్నంతనే మన సకల పాపాలను క్షణ మాత్రంలో  హరింపజేయగల మహిమాన్వితుడు శశిధరుడు.  కొన్ని నీళ్లను లింగంపై పోసి, ఒక్క మారేడు దళాన్ని శివలింగంపై ఉంచితే మురిసిపోయి...  కోరిన వరములను ఇచ్చే మహాదేవుడు..ఆ పరమశివుడు. అభిషేక ప్రియుడైన పరమశివుని పంచామృతాలతో, చెరకురసంతో, వివిధ ఫలాల రసాలతో అభిషేకించి... తుమ్మిపూలు, మల్లెలు, మందారాలు, పున్నాగ మొదలైన పువ్వులతో అర్చించటం శివునికి ప్రీతికరం. భస్మం, పసుపు, కుంకుమ, చందనం, పుష్పాలు మొదలైన వాటిని కలిపిన జలంతో అభిషేకించటంవలన ఆయనకు అమిత ఇష్టం..వాటిన్నటికన్నా ముఖ్యంగా మనసారా ఓ పరమశివా అని ప్రార్దన చేయటం అత్యవసరం.

 అందుకేనేమో...ఫ్లూట్ నాగరాజుగా విశిష్ట ఖ్యాతి పొందిన నాగరాజు తాళ్లూరి గారు ఆ శశిధరుని  మనసారా నింపుకుని మురళీగానం చేసారు.    నాగరాజు తాళ్లూరి దేశ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకున్న తెలుగు తేజం. అలాగే ఆయన మురళిగానంకు తోడుగా తన స్వరమాధుర్యంతో అందరి మనస్సులూ చూరగొనే ఎస్పీ బాలసుబ్రమణ్యంగారు గాత్రం అందించి..పరమ శివుని పరవశింప చేసారు. ఎంత మాధుర్యంతో ఈ గానం సాగుతుందంటే శివుడే స్వయంగా వచ్చి వింటున్నాడని అనిపిస్తుంది. 

"శివ కళ్యాణం  ఆల్బం" ప్రాజెక్ట్ నిర్మాత ,శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు ఏంతో  ఇష్టపడి చేయించుకున్న ఆల్బం అవడం గమనార్హం