శివ భక్తులకు అత్యంత ప్రీతి పాత్రమైనది... “శివ తాండవ స్త్రోత్రం”

శివ భక్తులకు అత్యంత ప్రీతి పాత్రమైనది...   “శివ తాండవ స్త్రోత్రం”

శివ భక్తులకు అత్యంత ప్రీతి పాత్రమైనది...   “శివ తాండవ స్త్రోత్రం”.. శివ భక్తుడైన రావణాసురుచే రచించబడింది. రావణాసురుడు  అతిశయించిన బల గర్వముతో పార్వతి,పరమేశ్వరుల నివాసమైన కైలాస పర్వతాన్ని తన ఇరవై బాహువులతో పెకిలిస్తుండగా శివుడు ఉగ్రుడై వచ్చినప్పుడు శివుని శాంతింపజేయడానికి శివుని స్తుతిస్తూ.. సామవేద పూరితంగా శబ్ధాలంకారాలతో కూడిన శివస్తోత్రము ని పాడారు.  రావణాసురుడు  ఆశువుగానే పాడినా అది అతిగొప్ప శివ స్తుతిగా పేరు తెచ్చుకుంది… వ్యాకరణం పరంగా చూసుకున్నా కూడా అది అత్యంత గొప్పదని చెప్తారు… స్త్రోత్రం మొత్తం గురులఘువులు ప్రత్యామ్నాయంగా వస్తుంటాయి… అందుకే ఆయన రావణబ్రహ్మ అయ్యారని పురాణోక్తం. 

ఈ    “శివ తాండవ స్త్రోత్రం”.. చదివినా, విన్నా...శివుడు ప్రసన్నుడై కోరుకున్న సకల కోరికలు తీరుస్తారని చెప్తారు. అంత గొప్పది అయిన శివ స్త్రోత్రాన్ని  ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీనివాస శర్మగారు స్వయంగా ఆలపిస్తూ ,సంగీత దర్శకత్వం చేసారు. శర్మగారితో పాటు.... ...అరుణ్ కౌండిన్య, స్వరాగ్ కీర్తన్ తమ స్వర సహకారం అందించారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.  కీ బోర్డ్ ప్లేయర్ ..భరత్, వీడియో ..సత్య ప్రమోద్, మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ ..సురేష్, ఎడిటింగ్..చంద్ర గౌడ .