చంద్రఘంట.. మూడవ రోజు అమ్మ దర్శనం..కల్యాణ కారకం, శాంతి ప్రదం

updated: October 12, 2018 07:42 IST
చంద్రఘంట.. మూడవ రోజు అమ్మ దర్శనం..కల్యాణ కారకం, శాంతి ప్రదం

Photo Courtesy: WIkipedia

'పిండజ ప్రవరారూఢ చండకో పాస్త్రకైర్యుతా

ప్రసాదం తమతేహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా'

శరన్నవరాత్రి మహోత్స వాలు మూడో రోజుకి చేరుకున్నాయి. ఒక్కో ప్రాంతంలో అక్కడ ఆచార,సంప్రదాయాలను బట్టి అమ్మవారిని కొలవటం జరుగుతుంది.  ఈ రోజున అమ్మవారు- సింహవాహిని. అన్నపూర్ణ దేవి,చంద్రఘంటగా  భక్తులకు దర్శనమిస్తుంది. ధనుస్సు, గద, శూలం, ఖడ్గం, పాశం వంటి ఆయుధాలు ధరిస్తుంది. పది చేతుల రూపంలో ఉండే అమ్మవారిని జయం, ధైర్యం, వీరత్వం కోసం భక్తులు పూజిస్తారు. ఈ రోజు  శ్రీ అన్నపూర్ణా దేవికి కొబ్బెరన్నం నైవేద్యం  పెట్టి ప్రార్దన నమస్కారాలు అర్పించి అమ్మ కృపకు పాత్రులవుతూంటారు. 

దుర్గామాత మూడవ నామమైన చంద్రఘంటా స్వరూపం మిక్కిలి శాంతిప్రదము, కల్యాణకారకము. తన శిరస్సుపై అర్ధచంద్రుడు ఘంటాకృతిగా వుండడం వల్ల ఈ నామం ఏర్పడింది. ఈమెని ఆరాధిస్తే సింహపరాక్రమముతో నిర్భయంగా ఉంటారు. జపమాల,ఘంట, బాణం, పదునైన ఖడ్గం, శ్వేత పద్మం, పానపాత్ర, త్రిశూలం, ధనుస్సు, కమలం, గద ధరించి మహాలావణ్య శోభతో ప్రకాశిస్తుంది.

 నవరాత్రుల్లో- దుష్టశిక్షణ చేసి, శిష్టరక్షణ చేసే అమ్మవారిని సహస్రనామ స్తోత్రంతో, షోడశోపచార పూజలతో ఆరాధించడం తరతరాలుగా  హిందూ ధర్మ సంప్రదాయంగా వస్తోంది.

మన దేశంలోని పలు ప్రాంతాల్లో, పలు రీతుల్లో ఈ దసరా ఉత్సవాల్ని నిర్వహించటం జరుగుతుంది.   దేవి అర్చనలు, శమీ వృక్ష పూజలు, ఆయుధ పూజలు- సకల ఐశ్వర్యాలను, ఆయురారోగ్యాలను, సుఖశాంతులను, విజయ పరంపరను ప్రసాదిస్తాయన్నది భక్తకోటి ప్రగాఢ విశ్వాసం!

ఈ నేపధ్యంలో ఫిక్సర్ టీవి (యూట్యూబ్ ఛానెల్)వారు ఆ తల్లి ఆశీస్సులతో ...శైలపుత్రి దేవి స్త్రోత్రం అందించారు. ఈ స్త్రోత్రానికి సంగీతం అందించింది ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు సాయి శ్రీకాంత్ .

పాడినది గాయక ప్రపంచంలో అడుగుపెట్టిన అనతి కాలంలోనే తనకంటూ పేరు తెచ్చుకుని దూసుకుపోతున్న కుమారి ధృతి. ఈ పండగ పూట ఈ స్త్రోత్రం విని ... అమ్మవారి అనుగ్రహం పొందండి.

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

Tags: Chandraghanta, third avatar of Navadurga, saisreekanth, vijaya dashami, Singer Shri Dhruthi

comments