లలితాదేవిగా అమ్మ అనుగ్రహం

updated: October 13, 2018 08:45 IST
లలితాదేవిగా అమ్మ అనుగ్రహం

Photo Courtesy: WIkipedia

కదమ్బవనచారిణీం మునికదమ్బకాదమ్బినీం
నితమ్బజితభూధరాం సురనితమ్బినీసేవితామ్|
నవామ్బురుహలొచనామభినవామ్బుదశ్యామలాం
త్రిలొచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే||

"కదంబవృక్షములు (కడిమి చేట్లు) వనమందు నివసించునదీ,మునిసముదాయమను కదంబవృక్షములను వికసింపచేయు (ఆనందింప చేయు) మేఘమాలయైనదీ, పర్వతముల కంటే ఏత్తైన నితంబము కలదీ, దేవతాస్త్రీలచే సేవింపబడునదీ, తామరలవంటి కన్నులు కలదీ,తొలకరిమబ్బు వలే నల్లనైనదీ, మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపురసుందరిని ఆశ్రయించుచున్నాను."

అమ్మవారు  ఈ  రోజున "శ్రీ లలితా మహా త్రిపుర సుందరిగా" పూజలు అందుకుంటోంది... త్రిపురాత్రయంలో రెండో శక్తి లలితా అమ్మవారు. దేవి ఉపాసకులకు ఈమే ముఖ్య దేవత. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్ఠాన శక్తిగా కొలువుదీరుతుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యా స్వరూపిణి. మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సువాసినీ పూజ చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి. 

పంచదశాక్షరి మహా మంత్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తారు లలితా మహా త్రిపుర సుందరి దేవిని.   దారిద్రయ దుఖాలను తొలగించి, సకల ఐష్వర్య అభిష్టాలను అమ్మవారు సీధ్ధింప చేస్తుంది. ఈమే శ్రీ విద్యా స్వరూపిణి .సృష్టి,స్తితి , సమ్హార స్వరూపిణి ! 

కుంకుమ తో నిత్య పూజ చేసే సువాసీనులకు ఈ తల్లీ మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీచక్ర ఆరధన . కుంకుమ అర్చన ,లలితా అష్టొత్తరముతో అమ్మని పూజించటం ద్వారా అమ్మ ప్రీతి చెందుతుంది. మాంగళ్య బలాన్ని కోరుతు సువాసీనులకి పూజ చేస్తూంటారు.

అమ్మవారు భండాసురుడు అనే లోకపీడికుడను,పరమకీరతకుదను వధించే ఘట్టం లో దేవతలు అందరు అమ్మని ప్రార్థన చెయ్యగా, వారు చేసిన యాగం నుండి చిదగ్ని సంభుతిగా అమ్మ ఆవిర్భవించింది.

పురాణం ఏం చెప్తోంది..
ఒకసారి వేదవేదాంగ పారంగతుడు అయిన అగస్త్య మహర్షి కంచి క్షేత్రానికి వచ్చి , కామక్షి దేవిని పూజించి, అనేక సంవత్సరములు తపస్సు చేసాడు . అప్పుడు శ్రీ మహా విష్ణువు అగస్త్యనికి హయగ్రీవ రూపములో ప్రత్యక్షమై ఏమి కొరిక అని అడగగా, మహర్షి ఆయనకు నమస్కరించి "  అందరికి మోక్షాన్ని పొందతానికి సులభమైన మార్గము ఏదైన ఉంటే, దానిని తెలియచెయ్యవల్సిందిగా ,లోక కల్యాణార్ధం విష్ణువు మూర్తిని ప్రార్థన చేసాడు. 
దానికి హయగ్రీవుడు "మానవులకు భుక్తిని, ముక్తిని, దేవతలకు శక్తిని అనుగ్రహించే తల్లి, లలితా పరాశక్తి మాత్రమే" అని చెప్పి ఆ లలితా చరిత్రను అగస్త్యుడికి వివరముగ తెలియచేసాడు.

 ఫల శ్రుతి
లలితా అమ్మవారి నామలను నిత్య పారాయణ చేసుకునే వారి ఇంట సమస్తమైన శుభాలు జరుగుతాయి. దేవి భాగవతం, లలితోపాఖ్యానం నిత్యం పఠన వలన అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు .

శ్లోకం: ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం, బింబాధరం పృథులమౌక్తిక శోభినాసమ్‌; ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం, మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్‌! 

ఈ నేపధ్యంలో ఫిక్సర్ టీవి (యూట్యూబ్ ఛానెల్)వారు ఆ తల్లి ఆశీస్సులతో ...శైలపుత్రి దేవి స్త్రోత్రం అందించారు. ఈ స్త్రోత్రానికి సంగీతం అందించింది ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు సాయి శ్రీకాంత్ .

పాడినది గాయక ప్రపంచంలో అడుగుపెట్టిన అనతి కాలంలోనే తనకంటూ పేరు తెచ్చుకుని దూసుకుపోతున్న కుమారి ధృతి. ఈ పండగ పూట ఈ స్త్రోత్రం విని ... అమ్మవారి అనుగ్రహం పొందండి.

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

Tags: Lalita Devi, Fourth day avatar of Navadurga, saisreekanth, vijaya dashami, Singer Shri Dhruthi

comments