ఇంత గొప్ప స్త్రోత్రం ఇంకెక్కడా దొరకదు

updated: October 19, 2018 11:15 IST
ఇంత గొప్ప స్త్రోత్రం ఇంకెక్కడా దొరకదు

లలితాసహస్రనామం గురించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే...ఈ చరాచర సృష్టిలో ఆ స్త్రోత్రాన్ని మించిన ఫలితాన్ని ఇచ్చేది మరొకటి లేదు.  లలితా సహస్రనామ స్తోత్రం వ్యాస ప్రోక్తం కాదు.  సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారం లోకి వచ్చింది.  ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రం.

ఎందుకు ఇంత గొప్పతనం 

లలితా సహస్రనామ స్తోత్ర నామాలని ఎవరు సాధనతో..భక్తితో అనుసంధానం చేస్తారో ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్ర స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతీ కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిన పూనింది కాబట్టి. అందుకే శ్రీలలితా సహస్రనామములు కేవలం స్తోత్రం కాదు. ఇది గొప్ప శాస్తమ్రు. గొప్ప ప్రమాణం.


ఎవరీ లలితాదేవి?

ఎరుపు రంగు దుస్తులు కట్టు కొన్న, ప్రేమ మయ చూపులు కలిగిన పాశము, అంకు శం, పుష్పం చెరకు గడను నాలుగు చేతులలో ధరించిన అణిమాది సిద్ధులను కలిగిన శివుని భార్య అయిన భవానియే లలిత. 

 శ్రీలలితా సహస్రనామములో ప్రతినామము ఒక మంత్రం. ఈ నామములు చదివితే వచ్చే ఫలితం అద్బుతం. జీవితం తరిస్తుంది. అపమృత్యువు పోతుంది. ఆయుష్షు పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సర్వపాపాలు తొలగిపోతాయి. ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు.అందుకే శ్రీలలితా సహస్రనామాలు చదువుదాం. చదివించుదాం. ముక్తిని పొందుదాం.
 
ల – సర్వవిద్యలకు లక్ష్యమైనది,
లి – రూపము లేనిది,
త – సంసారం నుండి తరింపజేయునది, శ్రీలలిత.

పురాణోక్తం...

అగస్త్య మహాముని శ్రీలలితను స్మరించేందుకు నామతారకమును అనుగ్రహించవలసినదిగా హయగ్రీవుడు అనే మహామునిని కోరుతాడు. ఏ పేరిట పిలిస్తే, ఆ తల్లి పలుకు తుందో ఆ పేర్లన్నీ హయగ్రీవుని అశ్వకంఠముతో ఆశువుగా వస్తాయి. ఈనామ సహస్రమే లలితా సహస్రం. ఇవి వేయినామాలు. ఇందులో కామాక్షి, పార్వతి, దుర్గ, మహాకాళి, సరస్వతి, భవాని, నారాయణి, కల్యాణి, రాజరాజేశ్వరి మహాత్రిపురసుందరి, వైష్ణవి, మహేశ్వరి, చండికా, విశాలాక్షి, గాయిత్రి అనేక దేవి రూపాలు కనపడతాయి.

అసలు ఆలోచనే పుట్టదు

మనకు టైమ్ వచ్చినప్పుడు తప్ప..అంటే బాగుపడే సమయం వచ్చినప్పుడు తప్ప లలితా సహస్రనామ స్తోత్రము పారాయణ చెయ్యాలని అనిపించదు...వినాలనే ఆలోచన కూడా పుట్టదు. కలియుగంలో మనకి లలిత సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం తప్ప అన్యము కాదు అని చెప్పబడుతోంది. 
 
ఇలా చేస్తే ఫలితం లేదు
 
చాలా మంది మనలో ..చిన్నప్పటి నుంచి  లలితా సహస్రనామ స్తోత్రం చదవడం మొదలెట్టాస్తారు. దాంతో  లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికి వచ్చేస్తుంది. అయితే  లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం అంటే  అలా   మొక్కుబడిగా...మనస్సు ఏదో ఆలోచిస్తూ..నోటితో అప్పచెప్పేయడము కాదు. లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మననస్సును హత్తుకుని నిలబడి పోవాలి..అప్పుడు ఆ ఫలితం సంపూర్ణంగా అందుతుంది.


ఎలా చదవాలి

ఈ వేయినామాలు 183 శ్లోకములలో చెప్పబడినవి. శ్రీమాతా అను నామముతో మొదలై లలితాంబికా అనునామముతో పూర్తవుతుంది. విడివిడిగా చదువుతే ఓం శ్రీమాత్రేనమః అని చదవాలి. అర్థము తెలుసుకునే చదవాలి. అలా వీలుకానప్పుడు నామజపము వలె చదవాలి. ఎలా చదివినా భక్తితో చదివితే పుణ్యం వస్తుంది. శ్రీమాత ఈ నామముతో మొదలవుతుంది. 

ఇక శ్రీలలితా సహస్రనామములు కేవలం స్తోత్రం కాదు. ఇది గొప్ప శాస్తమ్రు. గొప్ప ప్రమాణం.


వీడియోగా...

ఇలా ఎంతో గొప్పగా మహామునులు చేత, దేవతల చేత చెప్పబడ్డ శ్రీ లలితా సహస్రం..ఇప్పుడు అంతే గొప్పగా...అత్యంత భక్తి ,శ్రద్దలతో ప్రముఖ సంగీత దర్శకులు సాయి శ్రీకాంత్ గారి సారధ్యంలో... ప్రముఖ గాయని బాహుబలి ఫేమ్ సత్య యామిని మధుర గాత్రంతో  రికార్డ్ చేయబడింది. మీరు ఆ వీడియోని ఇక్కడ చూడవచ్చు.
 

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

Tags: Lalita sahasra namam, satya yamini, sai sreekanth

comments