4 వ శతాబ్దం నాటి శివాలయానికి పునర్వైభవం:

updated: June 21, 2018 21:29 IST
4 వ శతాబ్దం నాటి శివాలయానికి పునర్వైభవం:

శ్రీవల్లభేశ్వరస్వామి ((శ్రీమన్మహామల్లీశ్వర మహాదేవర మరకతలింగం) పేరుతో కోలువైన పరమశివుడు గుంటూరు జిల్లాలోని విప్పర్ల గ్రామంలో దర్శనమిస్తాడు. 4వ శతాబ్దం నాటికే ఈ ఆలయం ఉనికి గురించి శాసనాల ద్వారా తెలుస్తున్నది.వందలాది ఏళ్లుగా శిధిలావస్థలో ఉన్న ఈ దేవాలయం ఇప్పుడు మరలా వైభవాన్ని సంతరించుకుంది. ఈ ఆలయ ధర్మకర్తల వంశానికి చెందిన శ్రీ మంత్రిరాజు రమేష్ బాబు విప్పర్ల గ్రామ ముఖ్యులు శ్రీ ఆర్ శ్రీనివాసుతో కలిసి ఈ ఆలయ పునర్వైభవానికి పలు సంవత్సరాలు కృషి చేసారు. వారి ఇరువురి కృషి ఫలితంగా నేడు ఆలయం కన్నులవిందుగా భక్తులు ముందు నిలబడింది. అయితే ఇటీవల కాలంలో ధర్మకర్త రమేష్ బాబు శివైక్యం చెందిన కారణంగా అనుస్యూతంగా ధర్మకర్త పదవి ఆయన సోదరుడు మంత్రిరాజు సత్యనారాయణ గారికి చేరింది. వారు మరియు ఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్ధేంద్రస్వామి చేతులమీదుగా శివలింగప్రతిష్టాపన, ధ్వజస్థంభ ప్రతిష్టాపన (20 జూన్ 2018) నేడు జరిగాయి. 
ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు కూడా పాల్గొనడం విశేషం. వారు భక్తులకు మంచినీళ్లు అందివ్వడం, పూజారులకి కావాల్సిన వస్తువులు చేరవేయడం, మహాజనానికి వంటల ఏర్పాట్లలో సాయం అందించడం ఎంతో ఆదర్శంగా అనిపించింది.
" ఇక్కడ ముస్లిములు శివరాత్రి ఉపవాసాలు, జాగారాలు కూడా చేస్తారు. హిందువులూ పీర్ల పండుగల్లో అంతే ఆసక్తిగా పాల్గొంటారు. వందలేళ్లుగా ఇక్కడ హిందూ ముస్లిములు అన్ని విషయాల్లోనూ ఒకరికి ఒకరిగా ఉండడం ఆనవాయితీ" అని ఈ ప్రాంతానికి చెందిన రాజాశర్మ అనే ఒక పురోహితులు తెలిపారు.

"రంజాన్ రోజాలు, కార్తీకమాసం ఉపవాసాలు మాకు ఒక్కటే. రెండూ శరీరం శక్తిని పెంచేవే. ఈ ఊళ్లో మేము హిందువుల విభూతిని ఎంత పవిత్రంగా చూస్తామో, మా కళ్లల్లో సురుమాని హిందువులు అంత పవిత్రంగా చూస్తారు" అని అబ్దుల్లా అనే గ్రామస్థుడు తెలిపారు.

Click here for gallery

 


Tags: vipperla, vipparla temple, lord shiva temple, Mantri Ramesh babu, R.Srinivas

comments