నా శివుడే నా శివుడే

Updated: February 13, 2018 03:16:22 PM (IST)

Estimated Reading Time: 1 minute, 48 seconds

నా శివుడే నా శివుడే

హర-హర మహదేవ, రుద్రుడు, శివుడు, అంగీరాగురు, అంతకుడు, అండధరుడు, అంబరీషుడు, అకంప, అక్షతవీర్యుడు, అక్షమాలి, అఘోర, అచలేశ్వరుడు, అజాతారి, అజ్ఞేయ, అతీంద్రియుడు, అత్రి,   అర్థనారీశ్వరుడు అష్టమూర్తి ...ఇలా ఏ పేరుతో పిలిచినా పలికే దైవం పరమ శివుడే.  “శివ” అంటే “అస్తిత్వం లేనిది” అనీ, అలాగే ఆదియోగి, అని కూడా సూచిస్తుంది.   “శివ” అనే పదానికి భాషా పరంగా“ఏది లేదో అది” అని అర్ధం...పరికిస్తే..ఈ  అర్దంలోనే అనంతార్దం ఉంది.  ఆ  మహాదేవుడుని,దేవదేవుడుని ఎన్ని రకాలుగా పిలుచుకన్నా,ఎన్ని విధాలుగా స్తుతించుకున్నా , స్మరించుకున్నా వచ్చే ఆనందం అంతులేనిది. 
కోరిన కోరికలు తీర్చే  ఈ మహాశివుడుని...ఇదిగో ఈ వీడియోలో మరోసారి అద్బుతంగా స్మరించుకోవటం జరిగింది. ఈ పాట వింటే ఓ అద్బుతం జరుగుతుంది. అది మీ శరీరం రోమాంచితం కావచ్చు...మీ హృదయం నిండా శివుడే కొలవు అవటం కావచ్చు లేదా...కొద్ది క్షణాలు పాటు మీరే శివుడు కావచ్చు ...అంత మహత్తు గల ఈ పాటను చెవులారా వినండి..మనసారా నింపుకోండి..మీదే ఆలస్యం..శివ దర్శనం...
ఈ పాటను రచించిన వారు ..రఘు చతుర్వేదుల, సంగీతం వోకల్స్...శృతి రంజిని, డాన్స్ కర్టసి..శ్రావ్య మానస టీమ్..అలాగే ఈ వీడియో...జోటికస్ ప్రొడక్షన్ వారిచే రూపొందించబడింది.
 

కామెంట్స్