చంద్రఘంట.. మూడవ రోజు అమ్మ దర్శనం..కల్యాణ కారకం, శాంతి ప్రదం

Updated: October 12, 2018 07:42:21 AM (IST)

Estimated Reading Time: 1 minute, 30 seconds

చంద్రఘంట.. మూడవ రోజు అమ్మ దర్శనం..కల్యాణ కారకం, శాంతి ప్రదం

Photo Courtesy: WIkipedia

'పిండజ ప్రవరారూఢ చండకో పాస్త్రకైర్యుతా

ప్రసాదం తమతేహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా'

శరన్నవరాత్రి మహోత్స వాలు మూడో రోజుకి చేరుకున్నాయి. ఒక్కో ప్రాంతంలో అక్కడ ఆచార,సంప్రదాయాలను బట్టి అమ్మవారిని కొలవటం జరుగుతుంది.  ఈ రోజున అమ్మవారు- సింహవాహిని. అన్నపూర్ణ దేవి,చంద్రఘంటగా  భక్తులకు దర్శనమిస్తుంది. ధనుస్సు, గద, శూలం, ఖడ్గం, పాశం వంటి ఆయుధాలు ధరిస్తుంది. పది చేతుల రూపంలో ఉండే అమ్మవారిని జయం, ధైర్యం, వీరత్వం కోసం భక్తులు పూజిస్తారు. ఈ రోజు  శ్రీ అన్నపూర్ణా దేవికి కొబ్బెరన్నం నైవేద్యం  పెట్టి ప్రార్దన నమస్కారాలు అర్పించి అమ్మ కృపకు పాత్రులవుతూంటారు. 

దుర్గామాత మూడవ నామమైన చంద్రఘంటా స్వరూపం మిక్కిలి శాంతిప్రదము, కల్యాణకారకము. తన శిరస్సుపై అర్ధచంద్రుడు ఘంటాకృతిగా వుండడం వల్ల ఈ నామం ఏర్పడింది. ఈమెని ఆరాధిస్తే సింహపరాక్రమముతో నిర్భయంగా ఉంటారు. జపమాల,ఘంట, బాణం, పదునైన ఖడ్గం, శ్వేత పద్మం, పానపాత్ర, త్రిశూలం, ధనుస్సు, కమలం, గద ధరించి మహాలావణ్య శోభతో ప్రకాశిస్తుంది.

 నవరాత్రుల్లో- దుష్టశిక్షణ చేసి, శిష్టరక్షణ చేసే అమ్మవారిని సహస్రనామ స్తోత్రంతో, షోడశోపచార పూజలతో ఆరాధించడం తరతరాలుగా  హిందూ ధర్మ సంప్రదాయంగా వస్తోంది.

మన దేశంలోని పలు

కామెంట్స్