జ్ఞాన ప్రసాదం: శ్రీ దక్షిణాముర్తి స్తోత్రమ్

Updated: November 19, 2019 05:03:43 PM (IST)

Estimated Reading Time: 0 minutes, 24 seconds

జ్ఞాన ప్రసాదం: శ్రీ దక్షిణాముర్తి స్తోత్రమ్

వైష్ణవులు జ్ఞాన ప్రదాతగా శ్రీ హయగ్రీవుడిని ఆరాధిస్తే...శైవులు జ్ఞాన ప్రదాతగా శ్రీ దక్షిణా మూర్తిని ఉపాసిస్తారు.శివకేశవులు వేరు కారని భావించే మాలాంటి వారు ఇద్దరినీ ఆరాధిస్తూంటారు. ముఖ్యంగా శివునికు ప్రీతి పాత్రమైన కార్తీక మాసంలో శ్రీ దక్షిణామూర్తి ని ఆరాధిస్తూ...ఆయన తత్వాన్ని అవగాహ చేసుకుంటూ.. శ్రీ దక్షిణాముర్తి స్తోత్రమ్ ని పఠిస్తారు...వింటారు.! ఆ క్రమంలో ఈ పుణ్య దినాన దక్షిణామూర్తిని తలుస్తూ...ఆయన్ని హృదయంలో నింపుకునే విధంగా సుమధుర, మధురంగా టీవి శివ వారు శ్రీ దక్షిణాముర్తి స్తోత్రమ్ ని అందించారు. ఈ అద్బుతాన్ని వినటంతోనే మనలో జ్ఞానం నింపుకునే అవకాసం ఆ దక్షిణామూర్తి అందిస్తారు.  ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయినిలోని మహాకాళేశ్వరంలో శివుని విగ్రహం దక్షిణం వైపు ఉంటుంది.  అక్కడి శివుడు దక్షిణామూర్తి స్వరూపం!

దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తే....  దక్షిణామూర్తి మౌనం గానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు. ఆయన అలా మౌనముగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు, మనసుకూ అందనివారు కాబట్టి అలా బోధించారు. ఆది శక్తితోకూడి ఉన్న ఈ అవతారం చాలా ప్రశాంతంగా, మనోహరంగా ఉంటుంది. అంతటి శక్తిమంతుడుని మనం

కామెంట్స్