కాత్యాయనీ నమస్తుతే..

Updated: October 14, 2018 08:35:14 AM (IST)

Estimated Reading Time: 1 minute, 18 seconds

కాత్యాయనీ  నమస్తుతే..

Photo Courtesy: WIkipedia

బాలా త్రిపురసుందరి త్రిపురేశ్యైచ విద్మహే 
కామేశ్వర్యై చ ధీమహి తన్నోబాలా ప్రచోదయాత్.
 

శరన్నవరాత్రి ఉత్సవాలు దేశమంతటా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఆరో రోజు   అమ్మవారు..  ‘బాలా త్రిపుర సుందరి’గా దర్శశనమిస్తుంది.  కాత్యాయనిగా పూజిస్తారు. గంధం రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. మహిషాసురుణ్ని సంహరించడానికి త్రిమూర్తుల తేజస్సుతో దేవి అవతరించిన రోజు అది.

త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో, అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి.నిత్య సంతోషం కలుగుతుంది. 

బాలార్చన

త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత.షోడశ విద్యకు ఈ దేవత అధిష్ఠాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు.అసలు బాల త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు.

పురాణాల్లో..

బాలా త్రిపురసుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో, లలితా సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది. భండాసురుడు అనే రాక్షసునకు ముప్ఫై మంది పిల్లలు. వీళ్ళందరు అవిద్యా వృత్తులకు

కామెంట్స్