తనికెళ్ళ భరణి ప్రారంభించిన టీవిశివ.com ,శివతత్వ.com

Updated: November 22, 2019 06:52:53 PM (IST)

Estimated Reading Time: 3 minutes, 54 seconds

తనికెళ్ళ భరణి ప్రారంభించిన టీవిశివ.com ,శివతత్వ.com

సుమారు 650కి పైగా చిత్రాల్లో నటించి, రచయితగానూ, దర్శకుడిగానూ తన విశిష్టతను చాటుకున్న 'మణి' తనికెళ్ల భరణి.  వృత్తిపరంగా ఆయన ఎంత ప్రత్యేకంగా ఉంటారో...వ్యక్తిగతంగానూ అదే స్దాయిలో ఆధ్యాత్మిక శోభతో వెలుగుతూ ఉంటారు.  శివ భక్తుడు అయిన ఆయన  రాసిన ‘ఆటకదరా శివ’ ఎంత ప్రాచుర్యం పొందిందో తెలిసిందే. ఇప్పుడు ఆయన మరోసారి తనకు శివుని పై భక్తిని చాటుకున్నారు. SivaTattva.com , TvShiva.com పేరుతో ప్రారంభమైన రెండు యూట్యూబ్ ఛానెల్స్ ని,వెబ్ సైట్స్ ని  ఆయన మరో సీనియర్ నటుడు, రచయిత అయిన రావికొండలరావు గారితో కలిసి ఆవిష్కరించారు. ఓం నమఃశివాయ అంటూ భక్తులు శివనామ స్మరణతో భక్తి పారవశ్యంలో తరించే   కార్తీక మాసంలో ఈ ఈవెంట్ జరగటం విశేషం.  
 

 తణికెళ్ల భరిణి మాట్లాడుతూ...తమవంటి శివ భక్తులకి ఈ వెబ్ సైట్ చాలా ఉపయోగపడుతుందని, ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మక భావం పెరిగితే అది ప్రపంచ శాంతికి తోర్పడుతుందని  చెప్పారు. ఈ వెబ్ సైట్ రూపొందించిన సాప్ట్ వేర్ ఇంజినీర్ శ్వేత, సింధులను ప్రత్యేకంగా భరణిగారు అభినందించారు.
 
రావికొండలరావు గారు మాట్లాడుతూ... ప్రస్తుతం ప్రపంచం అంతా యుట్యూబ్ లో నిక్షిప్తమవుతోందని, యూత్ కూడా తమ సెల్ ఫోన్స్ లో రెగ్యులర్ గా యూట్యూబ్ ని ఫాలో అవుతున్నారని, కాబట్టి వారిని రీచ్ అవటానికి అక్కడికే

కామెంట్స్