పోస్ట్‌లు

ఉగాది ప్రాశస్త్యం

  ప్రతి సంవత్సరం మనమంతా  చైత్ర శుద్ధ పాడ్యమి తిథి.. ఉగాది రోజున తెలుగు నూతన సంవత్సరం జరుపుకుంటాము. ఈసారి ఏప్రిల్ 9వ తేదీ నుంచి శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభమైంది. ఈ పండుగ రోజున మనం ఎన్నో శుభకరమైన ప్రారంభాలు ,కార్యక్రమాలు చేస్తూంటారు.  మన భారతీయులము  రుతువులను అనుసరించి పండగలను జరుపుకోవటం ఆనవాయితీ. ఉగాది పండుగ కూడా అలాంటిదే. ఆకురాలే కాలం అయిన శిశిర ఋతువు నుంచి వసంతంలోకి అడుగుపెట్టిన రోజు మనం ఉగాది ని  ఘనంగా జరుపుకొంటాం. ప్రకృతి కొత్తగా ముస్తాబు అయ్యే రోజుది. అప్పటి వరకు ఎండిన మోడుల్లా కనిపించిన మొక్కలు చిగురు తొడగడం ప్రారంభిస్తాయి.   ఈ నేపధ్యంలో ఉగాది పర్వదిన ప్రాశస్త్యం ఓ సారి గుర్తు చేసుకుందాం.      తెలుగువారికి కొత్త సంవత్సరాది.. ఉగాది. ఏటా చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఈ పండుగను తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకొంటాము. ఉగస్య ఆది ఉగాది. ఉగ అంటే జన్మ, నక్షత్ర గమనం అని అర్థం. వీటికి ఆది అనగా.. నక్షత్ర గమనం మొదలుకావడం, జన్మకు మొదలు అని అర్థాలు. ఉగాది అంటే యుగమునకు ఆది.. నక్షత్రమునకు ఆది అని కూడా అర్థం. పురాణాలు ప్రకారం ..చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని
ఇటీవలి పోస్ట్‌లు