ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఉగాది ప్రాశస్త్యం

  ప్రతి సంవత్సరం మనమంతా  చైత్ర శుద్ధ పాడ్యమి తిథి.. ఉగాది రోజున తెలుగు నూతన సంవత్సరం జరుపుకుంటాము. ఈసారి ఏప్రిల్ 9వ తేదీ నుంచి శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభమైంది. ఈ పండుగ రోజున మనం ఎన్నో శుభకరమైన ప్రారంభాలు ,కార్యక్రమాలు చేస్తూంటారు.  మన భారతీయులము  రుతువులను అనుసరించి పండగలను జరుపుకోవటం ఆనవాయితీ. ఉగాది పండుగ కూడా అలాంటిదే. ఆకురాలే కాలం అయిన శిశిర ఋతువు నుంచి వసంతంలోకి అడుగుపెట్టిన రోజు మనం ఉగాది ని  ఘనంగా జరుపుకొంటాం. ప్రకృతి కొత్తగా ముస్తాబు అయ్యే రోజుది. అప్పటి వరకు ఎండిన మోడుల్లా కనిపించిన మొక్కలు చిగురు తొడగడం ప్రారంభిస్తాయి.   ఈ నేపధ్యంలో ఉగాది పర్వదిన ప్రాశస్త్యం ఓ సారి గుర్తు చేసుకుందాం.      తెలుగువారికి కొత్త సంవత్సరాది.. ఉగాది. ఏటా చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఈ పండుగను తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకొంటాము. ఉగస్య ఆది ఉగాది. ఉగ అంటే జన్మ, నక్షత్ర గమనం అని అర్థం. వీటికి ఆది అనగా.. నక్షత్ర గమనం మొదలుకావడం, జన్మకు మొదలు అని అర్థాలు. ఉగాది అంటే యుగమునకు ఆది.. నక్షత్రమునకు ఆది అని కూడా అర్థం. పురాణాలు ప్రకారం ..చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని

ఉగాది ప్రాశస్త్యం

 


ప్రతి సంవత్సరం మనమంతా  చైత్ర శుద్ధ పాడ్యమి తిథి.. ఉగాది రోజున తెలుగు నూతన సంవత్సరం జరుపుకుంటాము. ఈసారి ఏప్రిల్ 9వ తేదీ నుంచి శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభమైంది. ఈ పండుగ రోజున మనం ఎన్నో శుభకరమైన ప్రారంభాలు ,కార్యక్రమాలు చేస్తూంటారు. 

మన భారతీయులము  రుతువులను అనుసరించి పండగలను జరుపుకోవటం ఆనవాయితీ. ఉగాది పండుగ కూడా అలాంటిదే. ఆకురాలే కాలం అయిన శిశిర ఋతువు నుంచి వసంతంలోకి అడుగుపెట్టిన రోజు మనం ఉగాది ని  ఘనంగా జరుపుకొంటాం. ప్రకృతి కొత్తగా ముస్తాబు అయ్యే రోజుది. అప్పటి వరకు ఎండిన మోడుల్లా కనిపించిన మొక్కలు చిగురు తొడగడం ప్రారంభిస్తాయి.  

ఈ నేపధ్యంలో ఉగాది పర్వదిన ప్రాశస్త్యం ఓ సారి గుర్తు చేసుకుందాం.      తెలుగువారికి కొత్త సంవత్సరాది.. ఉగాది. ఏటా చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఈ పండుగను తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకొంటాము. ఉగస్య ఆది ఉగాది. ఉగ అంటే జన్మ, నక్షత్ర గమనం అని అర్థం. వీటికి ఆది అనగా.. నక్షత్ర గమనం మొదలుకావడం, జన్మకు మొదలు అని అర్థాలు. ఉగాది అంటే యుగమునకు ఆది.. నక్షత్రమునకు ఆది అని కూడా అర్థం.

పురాణాలు ప్రకారం ..చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని చెప్తారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ‘ఉగాది ఆచరణలోకి వచ్చెనని పురాణప్రీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడనేది మన వారి భావన.

ఇక ఉగాది అనగా జన్మ ఆయుష్షులకు మొదటి రోజు అని ఒక అర్థం. అలాగే యుగం అనగా రెండు లేదా జంట అని అర్థం. మన భారతీయ సంప్రదాయం ప్రకారం యుగమునకు ఆది కాబట్టి.. ఉగాది అని, సకల రుతువులకు చైత్రం ఆది గనక చైత్రమాసంలో వచ్చిన ఉగాది అని అంటాం.  అలాగే ఉగాది నుంచి  ఒక రుతువు నుంచి మరో ఋతువు కి   మారడం వల్ల వ్యాధులు విజృంభిస్తాయి. కాబట్టి వాటిని తట్టుకునే శక్తిని పొందడానికి షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడిని సేవిస్తారు.

దైవం.కామ్   మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తుంది

కామెంట్‌లు